ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) వచ్చే నెల నుంచి వివిధ మోడల్ కార్ల ధరలు రూ.32,500 చొప్పున పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్‌లు, ఆపరేషనల్ ఖర్చులు పెరిగిపోవడంతో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ధరల పెంపు అమల్లోకి వస్తుందని మారుతి సుజుకి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సవరించిన ధరల ప్రకారం మారుతి సుజుకి సెలెరియో రూ.32,500, ప్రీమియం మోడల్ ఇన్విక్టో ధర రూ. 30,000 పెరుగనున్నది. మారుతి సుజుకి పాపులర్ మోడల్ వ్యాగన్ఆర్ రూ.15,000, స్విఫ్ట్ ధర రూ. 5,000 పెరుగుతుంది. ఇక పాపులర్ ఎస్‌యూవీల్లో బ్రెజా కారు ధరూ. 20,ooo, గ్రాండ్ విటారా రూ.25,000 పెరుగుతాయి.
ఎంట్రీ లెవల్ స్మార్ట్ కారు ఆల్టో కే10 కారు ధర రూ.19,500, ఎస్ – ప్రెస్సో రూ.5,000 పెరుగుతుందని మారుతి సుజుకితన రెగ్యులేటరీలో తెలిపింది. ప్రీమియం కంపాస్ట్ మోడల్ కారు బాలెనో ధర రూ.9,000 పెరుగుతుంది. కంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ధర రూ.5,500, కంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ ధర రూ.10,000 పెరుగుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఎంట్రీ లెవల్ ఆల్టో కే10 కారు రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఇన్విక్టో రూ.28.92 లక్షలకు చేరుకుంది.