Maruti Fronx-Toyota Taisor | టయోటా-మారుతి గ్లోబల్ భాగస్వామ్యం నుంచి మరో కారు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ బేస్డ్ టయోటా అర్బన్ క్రూయిజర్ టైసోర్ మోడల్ కారును వచ్చేనెల మూడో తేదీన టయోటా కిర్లోస్కర్ మోటార్ ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం మారుతి విక్రయిస్తున్న బాలెనో -టయోటా గ్లాన్జా, మారుతి ఎర్టిగా- రూమియాన్, మారుతి సుజుకి ప్రీ ఫేస్ లిఫ్ట్ విటారా బ్రెజా వర్సెస్ టయోటా అర్బన్ క్రూయిజర్, మారుతితో టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి జిమ్నీని ఇన్ విక్టోగా మార్చినట్లు తెలుస్తున్నది. రెండు కంపెనీలు కలిసి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లు డెవలప్ చేస్తుంటాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారాను డెవలప్ చేస్తే, అర్బన్ క్రూయిజర్ ను టయోటా డిజైన్ చేశాయి.
టయోటా టైసోర్ కారు ఎక్స్టీరియర్గా న్యూ గ్రిల్లె, రీ డిజైన్డ్ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ యూనిట్స్, ట్వీక్డ్ బంపర్లు, ఇంటీరియర్గా ఫ్రెష్ అప్ హోల్స్టరీ ఉంటాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 40 వేల కి.మీ లేదా రెండేండ్ల వారంటీ, టయోటా లక్ష కి.మీ లేదా మూడేండ్ల వారంటీ కలిగి ఉంటాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2 -లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ (89.73 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్), 1.0 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ (100.06 పీఎస్ విద్యుత్, 147.6 ఎన్ఎం టార్క్) ఇంజిన్ కలిగి ఉంటాయి. 1.2 లీటర్ల పె్ట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ ఎంటీ లేదా 5-స్పీడ్ ఎఎంటీ, 1.0-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఆప్షన్ మారుతి ఫ్రాంక్స్ 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ (77.5 విద్యుత్, 98.5 ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వస్తుంది. ట్రిమ్స్, పవర్ ట్రైన్ల ఆధారంగా టయోటా అర్బన్ క్రూయిజర్ టైసోర్ ధరలు ఉంటాయి.