Maruti Suzuki Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). మొదటి నుంచి అత్యాధునిక టెక్నాలజీతో సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణం చేయగల కార్లను భారతీయులకు పరిచయం చేసింది. ప్రత్యేకించి స్పేసియస్‌గా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) తీసుకొచ్చింది.
అటువంటి ఎస్‌యూవీల్లో బ్రెజా (Maruti Suzuki Breza) ఒకటి. ఈ `మారుతి బ్రెజా (Maruti Suzuki Breza) ` అంటే ప్రతి ఒక్కరిలోనూ క్రేజ్ పెరుగుతున్నది. ఇప్పుడు ఈ కారు బుక్ చేసుకుంటే మన చేతికి రావడానికి సుమారు 10 నెలల టైం పడుతుందని తెలుస్తున్నది. మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza) కారు ఇటు పెట్రోల్.. అటు సీఎన్జీ వేరియంట్లలో లభ్యం అవుతున్నది. అంతే కాదు 10 కలర్స్ ఆప్షన్లలో 15 వర్షన్లలో ఇష్టమైన వేరియంట్ ఎంచుకోవచ్చు.
మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza) కారు ఇంజిన్ 1462 సీసీ సామర్థ్యంతో 86.63-101.65 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఐదుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణం చేయొచ్చు. లీటర్ పెట్రోల్‌పై 19.8 నుంచి 20.15 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 103 పీఎస్ విద్యుత్, 137 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ 88 పీఎస్ విద్యుత్, 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
2022 మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza) మోడల్లో యాంబియెంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్ప్లే, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వర్షన్ మోడల్ కార్లలో పెడల్ ఫిప్టర్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్స్ అప్ డిస్ప్లే కోసం టర్న్ బై టర్న్ నేవీగేషన్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు. వెహికల్, ప్రయాణికుల సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు ఆటోమేటెడ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (Automated Stability Program) ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు.
10 కలర్స్‌తోపాటు 15 వేరియంట్లలో అందుబాటులో ఉన్న మారుతి బ్రెజా కారు ధర రూ.8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్య పలుకుతుంది. బేస్ వేరియంట్ మారుతి ఎల్ఎక్స్ఐ మోడల్ ధర రూ.8.29 లక్షలు ఉంటే.. టాప్ హై ఎండ్ కారు బ్రెజా జడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ డీటీ ధర రూ.14.14 లక్షలు ఉంటుంది.