Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. స్ఫూర్తిదాయక పోస్టులపై స్పందిస్తుంటారు. సృజనాత్మకతతో కూడిన పోస్టులను ప్రోత్సహించడంతోపాటు వారిని ప్రశంసిస్తుంటారు. క్రియేటివిటీతోపాటు ఇన్స్పిరేషనల్ స్టోరీలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా అటువంటి వీడియోనూ పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. షిప్పింగ్ కంటైనర్‌ను ఒక కల్యాణ మండపంగా తీర్చి దిద్దడంతోపాటు మొబైల్ మ్యారేజీ హాలు అది. అద్భుతమైన కల్యాణ మండపంగా షిప్పింగ్ కంటైనర్‌ను తీర్చిదిద్దిన తీరుతో ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యారు.
మొబైల్ మ్యారేజీ హాలును చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలని ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పర్యావరణ పరంగా అనుకూలమైన ఈ మొబైల్ మ్యారేజీ హాల్.. మారుమూల ప్రదేశాల్లోనూ ప్రజలకు మంచి వసతులు అందుబాటులోకి తెస్తుందన్నారు. 40 అడుగుల పొడవు గల ఈ కంటైనర్‌ను ఫోల్డ్ చేసే వెసులుబాటు కూడా ఉండటం విశేషం.
I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810
— anand mahindra (@anandmahindra) September 25, 2022
మొబైల్ మ్యారేజీ హాల్ కం కంటైనర్ తెరుచుకున్నప్పుడు 30 అడుగుల వెడల్పు ఉంటుంది. సుమారు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల్యాణ మండపంలా కనిపించేలా రూపొందించారు. సకల హంగులతో స్టయిలిష్ ఇంటీరియర్ డిజైన్లతో రూపుదిద్దుకున్న ఈ మోడర్న్ మొబైల్ మ్యారేజీ హాలులో 200 మందికి భోజన వసతి కూడా కల్పించొచ్చు. నగరాలు, ముఖ్య పట్టణాల్లోని సాధారణ మ్యారేజీ హాల్స్‌కు తీసిపోని విధంగా రెండు ఏసీలు ఏర్పాటు చేశారు. కేవలం పెండ్లిండ్లే కాదు.. ఇతర వేడుకలకు కూడా దీన్ని వేదికగా వాడుకోవచ్చు. వానాకాలంలో బహిరంగ వేదికలకు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.