Reliance – TCS | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.95,522.81 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్యూఎల్ భారీగా లబ్ది పొందాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ గతవారం 33.02 పాయింట్ల వృద్ధితో 81.086.21 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 649.37 పాయింట్లు లాభ పడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,634.27 వద్ద పెరిగి రూ.20,29,710.68 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.17,167.83 కోట్లు పుంజుకుని రూ.16,15,114.27 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.15,225.36 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.12,268.39 కోట్లు పెరిగి రూ.8,57,392.26 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11,524.92 కోట్లు పతనమై 8,47,640.11 కోట్ల వద్ద స్థిరపడింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,695.14 కోట్లు పెరిగి 6,32,364.26 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.2,498.89 కోట్లు వృద్ధి చెంది రూ.7,27,578.99 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.1,992.37 కోట్లు పెరిగి రూ.6,71,050.63 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.1,245.64 కోట్లు పెరిగి రూ.7,73,269.13 కోట్ల వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,835.34 కోట్ల నష్టంతో రూ.12,38,606.19 కోట్ల వద్ద ముగిసింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.