హైదరాబాద్, డిసెంబర్ 26: ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐఎస్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్ రావు నియమితులయ్యారు. ఆదిత్యా ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ షుగర్ మిల్లర్ల అసోసియేషన్ 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
అలాగే ఈ సమావేశంలో ఇండియన్ షుగర్ మిల్స్ పేరును ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐఎస్ఎంఏ)గా మార్చివేశారు. ఐఎస్ఎంఏ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్ బయో ఆర్గానిక్స్ ఎండీ గౌతమ్ గోయల్ ఎంపికయ్యారు. ఎన్ఎస్ఎల్ షుగర్స్ సంస్థకు తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో రోజుకు 40 వేల టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు 150 మెగావాట్ల విద్యుత్ యూనిట్ కూడా ఉన్నది.