హైదరాబాద్, జూలై 25 : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..రాష్ట్ర మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 3ఎక్స్వో రెవేక్స్ మాడల్‌ను విడుదల చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.8.94 లక్షల నుంచి రూ.12.99 లక్షల గరిష్ఠ ధరల్లో లభించనున్నది.
పది లక్షల లోపు ధర కలిగిన ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నూతన మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 26 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు, 35 స్టాండర్డ్ ఫీచర్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సింగిల్-పాన్ సన్‌రూఫ్, రీమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.