Mahindra Thar Roxx | మార్కెట్లోకి మహీంద్రా 5-డోర్ థార్ రాక్స్.. రూ.12.99 లక్షల నుంచి ధర ప్రారంభం.. ఇవీ డీటెయిల్స్..!
Mahindra Thar Roxx |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తాజా ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను ఆవిష్కరించింది.
Mahindra Thar Roxx |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తాజా ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను ఆవిష్కరించింది. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny), ఫోర్స్ గుర్ఖా (Force Gurkha)లతోపాటు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. న్యూ ఎం-గ్లైడ్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నదీ కారు. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తీసుకొచ్చిన 5-డోర్ థార్ రాక్స్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.

మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు ఫ్రంట్ ఇండిపెండెంట్ డబుల్ విష్ బోన్ సస్పెన్షన్, రేర్ పెంటా లైక్ సస్పెన్షన్, అడ్వాన్స్డ్ డాంపర్ టెక్నాలజీస్ (ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్, హైడ్రాలిక్ రీబౌండ్ స్టాపర్, మల్టీ ట్యూన్ వాల్వ్ విత్ కాన్సెంట్రిక్ లాండ్), ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ రేర్‌లో విభిన్నంగా ఎలక్ట్రిక్ బ్రేక్ లాకింగ్ ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) కారు వీల్ బేస్ 2850 ఎంఎం పొడవు ఉంటుంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ వీల్ బేస్ కేవలం 2610 ఎంఎం మాత్రమే. మహీంద్రా థార్ రాక్స్ కారులో భారీ స్థాయిలో 644 లీటర్ల బూట్ స్పేస్ ఉంటది.
మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) బహుళ ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. జీ20 టీజీడీఐ ఎం-స్టాల్లియన్ పెట్రోల్ (177 పీఎస్ విద్యుత్, 380 ఎన్ఎం టార్క్), డీ22 ఎం హాక్ డీజిల్ (175 పీఎస్ విద్యుత్, 370 ఎన్ఎం టార్క్) వర్షన్లతో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఏసిన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ ఇటరేషన్లతో అందుబాటులో ఉంటది. జిప్ (Zip), జూమ్ (Zoom) డ్రైవ్ మోడ్స్, మూడు టెర్రైన్ మోడ్స్ – శాండ్ (Sand), మడ్ (Mud), స్నో (Snow) వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ క్రాల్ (4×4), ఇంటెలిటర్న్ (4×4) ఫీచర్లు ఉంటాయి. ఎంట్రీ లెవల్ మహీంద్రా థార్ రాక్స్ కారు పెట్రోల్ ఇంజిన్ 162 పీఎస్ విద్యుత్-330 ఎన్ఎం టార్క్, డీజిల్ ఇంజిన్ 152 పీఎస్ విద్యుత్-330 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి.

6-ఎయిర్ బ్యాగ్స్, 3-పాయింట్ సీట్ బెల్ట్ ఫర్ ఆల్ సీట్స్ తోపాటు 35కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు ఈ మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx). ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ (హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్)తోపాటు నూతనంగా డిజైన్ చేసిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ జత చేశారు. 10.25 (టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ విత్ నైన్ స్పీకర్స్, వైర్ లెస్ చార్జర్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, ఆడ్రెనోక్స్ టెక్నాలజీతో 80కిపైగా కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
వీటితోపాటు ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ తర్వాత లెవల్ 2-అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్న మూడో మహీంద్రా కారు థార్ రాక్స్. ప్రస్తుతానికి ఆర్డబ్ల్యూడీ వేరియంట్ థార్ రాక్స్ ధరలు మాత్రమే వెల్లడించింది మహీంద్రా. ఏడబ్ల్యూడీ వేరియంట్ల ధరలు తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 14 నుంచి మహీంద్రా థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్ ప్రారంభిస్తారు. అక్టోబర్ మూడో తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. దసరా నుంచి డెలివరీ ప్రారంభిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

వేరియంట్ల వారీ ధరలు ఇలా
- ఎంఎక్స్1 ఆర్డబ్లూడీ పెట్రోల్ ఎంటీ – రూ.12,99 లక్షలు.
- ఎంఎక్స్1 ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ.13.99 లక్షలు.
- ఎంఎక్స్3 ఆర్డబ్లూడీ పెట్రోల్ ఏటీ- రూ.14.99 లక్షలు.
- ఎంఎక్స్3 ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ.15.99 లక్షలు.
- ఎఎక్స్3ఎల్ ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ. 16.99 లక్షలు.
- ఎంఎక్స్5 ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ.16.99 లక్షలు.
- ఎఎక్స్5 ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ. 18.99 లక్షలు.
- ఎఎక్స్7ఎల్ ఆర్డబ్లూడీ డీజిల్ ఎంటీ – రూ.18.99 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

