ముంబై, జూలై 30: స్కార్పియో-ఎన్ సరికొత్త ఎస్యూవీ మోడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్‌లు ఆరంభించిన ఒక్క నిమిషంలోనే 25 వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. గత నెల 27న మార్కెట్‌కు పరిచయం చేసిన ఈ వాహనం శనివారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ఆరంభించింది. ఉదయం 11 గంటలకు ఆరంభించిన నిమిషంలో 25 వేల బుకింగ్‌లు రాగా, కేవలం అరగంటలోనే లక్ష యూనిట్లకు పైగా వచ్చాయని పేర్కొంది. ఎక్స్‌షోరూం ధర ఆధారంగా బుకింగ్ విలువ రూ.18 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు పండుగ సీజన్ సెప్టెంబర్ 26 నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆరుగురు లేదా ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ మోడల్ పెట్రోల్, డీజిల్లోనూ లభించనున్నది.