ముంబై, జనవరి 7 : మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లోకి సరికొత్త ఈవీలను పరిచయం చేసింది. వీటిలో బీఈ6, ఎక్స్‌వీ 9ఈ పేర్లతో విడుదల చేసిన ఈ కార్లు రూ.18.9 లక్షల నుంచి రూ.30.5 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నాయి. వీటిలో బీఈ6 సింగిల్ చార్జింగ్‌తో 682 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, ఎక్స్ఈవీ 9ఈ ఫీచర్ కలిగిన మాడల్ 656 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కారులో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్‌తో కేవలం 20 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ రీచార్జికానున్నది. బీవైడీ ఆటో 3, టాటా హారియర్ ఈవీ, టాటా సఫారీ ఈవీలకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.