Mahindra BE 6 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్లో త్వరలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతుంది. హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) కారుకు పోటీగా మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన బీఈ 6 (BE6) కారును ఆవిష్కరించనున్నది. డ్రైవింగ్ అవసరాలు, వేర్వేరు ప్రాధాన్యాలకు అనుగుణంగా వెరైటీ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రతి వేరియంట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు, బ్లెండింగ్ పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ, డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత దశల వారీగా కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది.
వేరియంట్ – బ్యాటరీ ప్యాక్ – ధర
పాక్ వన్ – 59కిలోవాట్లు – రూ.18.90 లక్షలు
పాక్ వన్ ఎబౌవ్ – 59కిలోవాట్లు – రూ.20.50 లక్షలు
పాక్ టూ – 59 కిలోవాట్లు – రూ. 21.90 లక్షలు
పాక్ త్రీ సెలెక్ట్ – 59 కిలోవాట్లు – రూ. 24.50 లక్షలు
పాక్ త్రీ – 59కిలోవాట్లు – రూ. 26.90 లక్షలు
బేస్ వేరియంట్ మహీంద్రా బీఈ6 (Pack 1 BE6) కారు సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో కూడిన 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 140 కిలోవాట్ల డీసీ చార్జర్ సాయంతో కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం బ్యాటరీ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. వన్ టచ్ సింగిల్ పెడల్ డ్రైవ్‌తోపాటు మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్‌లో ప్యాక్ వన్ బీఈ6 మోటార్ 170 కిలోవాట్ల విద్యుత్ వెలువరిస్తుంది. రేస్-రెడీ డిజిటల్ కాక్‌పిట్, ఇల్యూమినేటెడ్ లోగో, బీ- ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ ఆర్18 వీల్స్, సిక్స్ ఎయిర్బ్యాగ్స్తోపాటు సేఫ్టీ, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్, రేర్ పార్కింగ్ సెన్సర్స్ విత్ హెచ్డీ కెమెరా తదితర ఫీచర్లు ఉంటాయి. బేస్ వేరియంట్ మహీంద్రా బీఈ6 (Pack 1 BE6) కారులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ప్రాసెసర్‌తో పని చేసే డ్యుయల్ 12.3- అంగుళాల డ్యుయల్ స్క్రీన్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే, బిల్ట్ ఇన్ అమెజాన్ అలెక్స్, పాపాల్ (పెట్మోడ్)తోపాటు స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్, స్పేసియస్ ఫ్రంక్, ట్రంక్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి.
బేస్ వేరియంట్‌తో పోలిస్తే పాక్ 1 ఎబౌవ్ (59 కిలోవాట్లు) కారులో అదనపు ఫీచర్లు ఉంటాయి. స్టైలిష్ ఆర్19 వీల్స్, ఫిక్స్డ్ గ్లాస్ ఇన్ఫినిటీ రూఫ్, టీపీఎంఎస్తోపాటు ఇండివిడ్యుయల్ టైర్ ప్రెషర్, వైండ్ షీల్డ్ కోసం ఆటో డీఫాగర్, ఫ్రంట్ రోలో వైర్లెస్ చార్జింగ్, డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, కంఫర్టబులిటీ కోసం ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ తదితర ఫీచర్లు ఉంటాయి.
బీఈ6 పాక్ 2 (59 కిలోవాట్లు) వేరియంట్ అత్యంత అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తోంది. రిలాక్స్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రాప్డ్ ఫినిష్, ఎక్స్టీరియర్గా సీక్వెన్సియల్ టర్న్ ఇండికేటర్లు, స్టార్టప్ లైటింగ్ సీక్వెన్స్, కార్నరింగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, వన్ రాడార్, వన్ విజన్ కెమెరా ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్‌తోపాటు లెవెల్-2 అడాస్‌తో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. 16-స్పీకర్ల హార్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ విత్ డోల్బీ ఆట్మోస్, ఎన్ఎఫ్సీ కీ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లు, రేర్ ఏసీ వెంట్స్, రేర్ పార్శిల్ షెల్ఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
పాక్ 3 సెలెక్ట్ (59 కిలోవాట్లు) కారు స్మూత్ రైడ్ కోసం ఇంటెలిజెంట్ అడాప్టివ్ సస్పెన్సన్ ఉంటుంది. సీ-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ సిగ్నేచర్తోపాటు ఎలివేటెడ్ డిజైన్, టెయిల్ ల్యాంప్స్, ఆర్19 అల్లాయ్ వీల్స్, లెదరట్టె సీట్ అప్హోల్స్టరీ తదితర ఫీచర్లు ఉంటాయి. డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగ్ (including a driver knee airbag)తోపాటు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, మహీంద్రా సెక్యూర్ 360 లైవ్ వ్యూ, రికార్డింగ్ సిస్టమ్, 24 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతోపాటు క్వాల్కామ్ 8295 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో టెక్నాలజీ అప్‌గ్రేడ్, ఆటో పార్క్, వీడియో కాలింగ్, డ్యుయల్ వైర్ లెస్ చార్జింగ్, వీఆర్ ఎల్ఈడీ ఎయిర్ ఫిల్టరేషన్, 6-వే అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీట్ విత్ లుంబార్ సపోర్ట్‌తోపాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పాసివ్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉంటాయి.
లగ్జరీ పెర్ఫార్మెన్స్తో టాప్ వేరియంట్ పాక్ 3 వేరియంట్ 79 కిలోవాట్ల మోటార్‌తో వస్తోంది.79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 210 కిలోవాట్ల విద్యుత్ వెలువరిస్తుంది. 175కిలోవాట్ల డీసీ చార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం చార్జింగ్ అవుతుంది. ఇంటీరియర్‌లో 16 మిలియన్ కలర్స్ అంబియెంట్ లైటింగ్‌తోపాటు ఇన్ఫినిటీ రూఫ్, నైట్ ట్రైల్ కార్పెట్ ల్యాంప్స్ ఉంటాయి. విజన్ ఎక్స్ అగుమెంటెడ్ రియాల్టీ హెడ్ అప్ డిస్ప్లే, డ్రైవర్ ఇన్షియేటెడ్ ఆటో లేన్ చేంజ్తోపాటు ఫైవ్ రాడార్లు, వన్ విజన్ కెమెరా, ఎల్2+ అడాస్ , లేన్ సెంట్రింగ్, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫ్రంట్ అండ్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంటాయి.