Reliance M-Cap | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్ 10 స్క్రిప్ట్‌లు రక్తమోడాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు అగ్రశ్రేణి సంస్థలు రూ. 2.85 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. కోల్పోయాయి. మార్కెట్ లీడర్‌గా ఉన్న రిలయన్స్ భారీగా నష్టపోయింది. గతవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 2,225.29 పాయింట్లు (3.89 శాతం), నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 691.30 పాయింట్లు (4.04 శాతం) నష్టపోయాయి.
అన్నింటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,14,767.5 కోట్లు కోల్పోయి రూ.17,73,196.68 కోట్లకు పడిపోయింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.42,847.49 కోట్లు కోల్పోయి రూ.12,56,152.34 కోట్ల వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,984.46 కోట్లు పతనమై రూ.7,31,068.41 కోట్లతో నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ. 20,558.92 కోట్లు కోల్పోయి రూ.5,05,068.14 కోట్ల వద్ద ముగిసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,625.96 కోట్లు పతనమై రూ.5,00,136.52 కోట్ల వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.16,091.64 కోట్లు నష్టపోయి రూ.3,90,153.62 కోట్ల వద్ద ముగిసింది. హౌసింగ్ డెవలప్మెంట్ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,924.03 కోట్లు కోల్పోయి రూ.3,90,045.06 కోట్ల వద్ద స్థిర పడింది.
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 10,843.4 కోట్లు కోల్పోయి రూ.4,32,263.56 కోట్లతో సరిపెట్టుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,285.69 కోట్లు నష్టపోయి రూ.6,49,302.28 కోట్ల వద్ద నిలిచింది. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎం-క్యాప్ రూ.2,322.56 కోట్లు కోల్పోయి రూ.4,49,255.28 కోట్ల వద్ద ముగిసింది.