న్యూఢిల్లీ, ఆగస్టు 20: యూఏఈకి చెందిన లులూ గ్రూపు తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో మాల్స్‌ను నిర్వహిస్తున్న సంస్థ..వచ్చే మూడేండ్లలో కాలంలో మరో 12 మాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో భారత్‌లో మాల్స్‌తోపాటు హైపర్మార్కెట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, ఇందుకు సంబంధించిన వ్యాపారాలకోసం రూ.19 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డైరెక్టర్ శిబు ఫిలిప్స్ వెల్లడించారు. వచ్చే మూడేండ్లకాలంలో హైదరాబాద్‌తోపాటు వారణాసి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలతోపాటు ఇతర నగరాల్లో మాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు కొచ్చి, తిరువనంతపురం, త్రిస్సూర్, బెంగళూరు, లక్నోల్లో మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ను నిర్వహిస్తున్న సంస్థ..వచ్చే మూడేండ్లలో 45 లక్షల చదరపు అడుగుల విస్థీర్ణంలో మాల్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.