న్యూఢిల్లీ, జనవరి 28: అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,054.74 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,466.71 కోట్ల లాభంతో పోలిస్తే 16.7 శాతం తగ్గిందని పేర్కొంది. గతేడాది కమర్షియల్ ప్రాపర్టీని విక్రయించడంతో భారీగా నిధులు సమకూరడం వల్లనే లాభాలు భారీగా వచ్చాయని తెలిపింది. కానీ, సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.36,661.08 కోట్ల నుంచి రూ.40,134.31 కోట్ల కు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో కొత్తగా రూ.50,359 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని, అంతక్రితం ఏడాది వచ్చిన దాంతో పోలిస్తే 31 శాతం తక్కువని పేర్కొంది.