న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగ్నివీర్లకు ప్రత్యేక వ్యక్తిగత రుణ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద తక్కువ వడ్డీకే రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చును. ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసిన బ్యాంక్.. 10.50 శాతం వార్షిక వడ్డీకి రుణాలు మంజూరు చేయనున్నట్టు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
అగ్నిపథ్ స్కీం ముగిసేలోగా తిరిగి చెల్లింపులు జరిపేవిధంగా స్కీంను తీర్చిదిద్దింది. సెప్టెంబర్ 30లోపు తీసుకునే రుణాలకు ఈ వడ్డీరేటు వర్తించనున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రొగ్రాం కింద వీరిని నియమించుకున్నది.