న్యూఢిల్లీ, మే 24: ఎంపిక చేసిన మాడళ్ల కార్ల ధరలను పెంచింది హోండా కార్స్ ఇండి యా. సెడాన్ సిటీ, అమేజ్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అమేజ్ మాడల్ రూ.6.99 లక్షలు మొదలుకొని రూ.9.60 లక్షల లోపు లభిస్తుండగా, సిటీ హైబ్రిడ్ మాడల్ రూ.11.55 లక్షల నుంచి రూ.20.39 లక్షల లోపు లభిస్తున్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.