Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ బెటర్.. ఎందుకంటే..?!
Mutual Funds | కుటుంబ అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Mutual Funds | వేతన జీవులు తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్ ఫండ్స్ చాలా చక్కగా ఉపకరిస్తాయి. పెట్టుబడులకు పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో ఇన్వెస్టర్లు తమకు అవసరమైన పథకాలను ఎంపిక చేసుకోవడంలో గందరగోళ పడుతుంటారు. సరైన మ్యూచువల్ ఫండ్ స్కీం ఎంచుకునేందుకు సాయపడే కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం..
కుటుంబ అవసరాలను బట్టి పెట్టుబడులు పెట్టాలి
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ వయస్సు, మీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలు, పన్ను నిర్వహణ, ప్రత్యేకించి రిటైర్మెంట్కు మిగిలిన వయస్సు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగులైతే తమ వేతనం నుంచి కొంత సొమ్ము క్రమం తప్పకుండా ఆదా చేయడం మరిచిపోవద్దు. కొన్ని కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్, ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే ప్రోత్సాహకాలను మ్యూచువల్ ఫండ్స్‌కు తరలించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు అంటే కొంత రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ముప్పు తగ్గించుకోవడానికి, విభిన్న ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి వారు వేర్వేరు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడితే మంచిదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
గణనీయ ఆదాయం పొందాలంటే భారీమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్లకు ఇది వర్తించదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతినెలా రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. నెలకు రూ.2000 చొప్పున 12శాతం వడ్డీ చొప్పున 20 ఏండ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.సుమారు 20 లక్షల మొత్తం డిపాజిట్ అవుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం మరువొద్దు
వేతన జీవులు తమ ఉపాధిలో అనిశ్చితి ఏర్పడినప్పుడు తలెత్తే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ నిధి అవసరం. ఆర్థిక అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అధిక లిక్విడిటీ కలిగి ఉండాలి. ఈ నిధి సమకూర్చుకోవాలంటే స్వల్పకాలిక డెట్ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. వేగవంతమైన లిక్విడిటీకి, లిక్విడ్ ఫండ్స్, ఆల్ట్రా షార్ట్ డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడుల వల్ల తక్కువ రిస్క్ ఉండటంతోపాటు ఎమర్జెన్సీ పరిస్థతులు తలెత్తినప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు.
బాధ్యతలకు అనుగుణంగా ఇన్వెస్ట్ మెంట్
దీర్ఘకాలికంగా సంపద సృష్టించడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ ఉన్నా ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక మోస్తరు రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధమైతే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ నాటికి మీ ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి. అటువంటి సమయంలో తక్కువ రిస్క్ గల లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

