45 నిమిషాల్లో ఎంఎస్ఎంఈలకు రుణం
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. నిధులు లేక సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కేవలం 45 నిమిషాల్లో రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
- ప్రత్యేక ప్రణాళికను ప్రకటించిన ఎస్బీఐ
ముంబై, జూన్ 11:దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. నిధులు లేక సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కేవలం 45 నిమిషాల్లో రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చిన్న స్థాయి రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్ఎంఈ (చిన్న, మధ్యతరహా సంస్థలు) డిజిటల్ బిజినెస్ లోన్ల పేరుతో ప్రత్యేక ప్రొడక్ట్‌ను విడుదల చేసింది.
ఈ ప్లాన్ కింద ఎంఎస్ఎంఈలకు కేవలం 45 నిమిషాల్లో రుణాన్ని మంజూరుకానున్నదని తెలిపింది. చిన్న వ్యాపారాలకు రుణాన్ని సులభంగా అందించడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మార్చి 31తో ముగిసిన ఏడాదికిగాను బ్యాంక్ ఎస్ఎంఈలకు రూ.4.33 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసింది.
రుణాన్ని తీసుకునే చిన్న స్థాయి సంస్థలు ఐటీఆర్, జీఎస్టీ రిటర్నులు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఇస్తే సరిపోతున్నది. ఇలా ఇచ్చిన సమాచారం తర్వాత కేవలం 10 సెకండ్లలోనే రుణానికి సంబంధించిన మంజూరు అయ్యే సమాచారం ఇవ్వనున్నట్లు ఇందుకోసం ప్రత్యేక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.50 లక్షల వరకు ఎంతైనా రుణం తీసుకునే అవకాశం కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

