న్యూఢిల్లీ, నవంబర్ 2: ఒకప్పుడు దేశీయ రోడ్లపై రివ్వున దూసుకుపోయిన ఎల్ఎంఎల్ స్కూటర్ మళ్లీ ప్రత్యక్షం కాబోతున్నది. ఈసారి మాత్రం ఈ-స్కూటర్‌గా ఉండనున్నది. స్టార్ స్కూటర్ పేరుతో విడుదల చేయనున్న ఈ మోడల్ కోసం ముందస్తు బుకింగ్‌లు సైతం మొదలయ్యాయి.
మూడు మోడళ్ళను విడుదల చేయనున్న సంస్థ.. వీటిలో ఒకటి ఈ-స్కూటర్ అని వెల్లడించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ మోడల్‌ను బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. ధర, మోడల్ వివరాలు తెలియరాలేదు. అయితే ఒక్క చార్జింగ్‌పై 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సమాచారం.