Lloyds Banking Group | కోట్లాది కస్టమర్లు.. వేలాది ఉద్యోగులు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ సొంతం..
బ్రిటన్‌లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్‌లో ఓ నూతన టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం.
Lloyds Banking Group | బ్రిటన్‌లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్‌లో ఓ నూతన టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. రెండున్నర శతాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన లాయిడ్స్ బ్యాంక్ నుంచే ఈ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ పుట్టుకురాగా.. ప్రస్తుతం అన్ని లాయిడ్స్ కంపెనీలకు ఈ గ్రూపే మాతృ సంస్థ. ఇక బ్యాంకింగ్ సేవలతోపాటు బీమా, పెట్టుబడుల్లోనూ లాయిడ్స్ గ్రూప్ రాణిస్తున్నది.
బ్రిటన్‌తోపాటు ఐరోపా దేశాల్లోని పలు కంపెనీలను కొంటూ విస్తరిస్తూపోతున్న లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. ఆసియా దేశాలతోపాటు ఇతర ఖండాల్లోని దేశాల్లోనూ బలపడే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ రాజధాని నగరంలో టెక్నాలజీ సెంటర్‌ను తీసుకువస్తున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బ్రిటన్ పర్యటన నేపథ్యంలోనే లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ రావడం గమనార్హం. ఈ టెక్నాలజీ సెంటర్.. ఇక్కడి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా రంగాల ఉన్నతికి దోహదపడగలదన్న విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నది.

లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్
ప్రారంభం : 2009
రంగం : బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రధాన కేంద్రం : లండన్ (బ్రిటన్)
చైర్మన్ : రాబిన్ బుడెన్బర్గ్
సీఈవో : చార్లీ నన్
ఉత్పత్తులు : రిటైల్, కమర్షియల్, ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్ సేవలు, జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు, పెన్షన్స్
రెవిన్యూ : 13.957 బిలియన్ పౌండ్లు
లాభం : 5.555 బిలియన్ పౌండ్లు
మొత్తం ఆస్తులు : 877.8 బిలియన్ పౌండ్లు
ఉద్యోగులు : 58,000
కస్టమర్లు : దాదాపు 3 కోట్లు
అనుబంధ సంస్థలు : లాయిడ్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్కాటిష్ విడోస్, లాయిడ్స్ డెవలప్మెంట్ క్యాపిటల్, అగ్రికల్చరల్ మార్ట్గేజ్ కార్పొరేషన్, బ్లాక్ హార్స్, లెక్స్ ఆటోలీజ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

