Life Insurance | జీవిత బీమా సంస్థలకు భారత జాతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) శుభవార్త అందించింది. ఇక నుంచి బీమా సంస్థలు కొత్త బీమా ప్రొడక్ట్‌లు ఆవిష్కరిస్తున్నప్పుడు ఐఆర్డీఏఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మార్కెట్లో బీమా ప్రొడక్ట్స్‌ను ప్రవేశపెట్టి.. తదుపరి రెగ్యులేటర్‌కు తెలియచేయవచ్చ్చు.
ఈ మేరకు ఐఆర్డీఏఐ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరోగ్య, సాధారణ బీమా సంస్థలకు కూడా ఇదే సడలింపు వర్తింపజేస్తూ ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత పొదుపు, వ్యక్తిగత పెన్షన్, యాన్యుటీ పథకం వంటి బీమా ప్రొడక్ట్స్ మినహా అన్ని ఉత్పత్తులను జీవిత బీమా సంస్థలను ప్రారంభించవచ్చు. మార్కెట్లో పరిస్థితులు, అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా బీమా సంస్థలు తమ ఉత్పత్తులు ప్రారంభించొచ్చు.
తాజా ఐఆర్డీఏఐ నిర్ణయం వల్ల పాలసీదారుల చాయిస్లకు అనుగుణంగా బీమా ఉత్పత్తుల విస్తరణకు దారి తీస్తుంది. బీమా సంస్థల సులభతర వాణిజ్యానికి మార్గం సుగమం అవుతుంది. అయితే, నూతన బీమా ప్రొడక్ట్స్ ప్రారంభించడానికి బీమా సంస్థలు బోర్డు ఆమోదిత ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రైసింగ్ పాలసీ (బీఏపీఎంపీపీ) అవసరం.