న్యూఢిల్లీ, మార్చి 28: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కార్యాలయాలు కూడా శని, ఆది, సోమవారాలు తెరిచివుండనున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయని ఒక ప్రకటనలో సంస్థ వెల్లడించింది.
చిన్న మొత్తాలపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ, మార్చి 28: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు గత వడ్డీరేట్లు కొనసాగించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆరా ఇన్ఫ్రాకు అవార్డు
న్యూఢిల్లీ, మార్చి 28: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆరా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ను.. బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ఎర్లీ ఆపరేషనలైజేషన్ విభాగంలో ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుంచి కంపెనీ ప్రతినిధి సంజయ్ వినోద్ మిశ్రా అందుకున్నారు.