మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్‌బై

సియోల్, ఏప్రిల్ 5: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ.. నష్టాల్లో నడుస్తున్న తమ మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ విడిభాగాలు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, ఇతరత్రా ఉత్పత్తులు, సేవలపై మరింత దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి తమ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని, ఈ జూలై చివరికల్లా మొబైల్ ఫోన్ వ్యాపారం పూర్తిగా మూతబడుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ సంస్థగా వెలుగొందిన ఎల్జీ.. చైనా, ఇతర దేశాల సంస్థల పోటీతో వెనుకబడిపోయింది. మొబైల్స్ వ్యాపారం నుంచి వైదొలిగినా.. ఇప్పటికే అమ్మిన ఫోన్ల సర్విసింగ్ కొనసాగుతుందని ఎల్జీ స్పష్టం చేసింది.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్‌లో ఇండ్లకు భలే గిరాకీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- lg
- mobiles
- south koria
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

