Lemon Prices | కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తేనె, పసుపుతో నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు తాగాలని వైద్యులు చెప్పారు. అంతే కాదు వేసవిలో భానుడి ప్రతాపానికి వడదెబ్బ బారిన పడే వారు బాగానే ఉంటారు. అటువంటి వారు గ్లాస్ నిమ్మరసం నీరు సేవిస్తే ఊరట పొందుతారు. సీ విటమిన్ నిల్వలు పుష్కలంగా ఉన్న నిమ్మకాయతో మేలు అంతా ఇంతా కాదు.. కానీ అదే నిమ్మకాయలకు కొరత ఏర్పడింది. అంతే దాని ధరలు కూడా పైపైకి దూసుకెళ్తున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిమ్మకాయలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కిలో నిమ్మకాయలకు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఇదే నిమ్మకాయలు కిలోపై రూ.50-60లకు లభించేవి. అంటే దాదాపు, నాలుగు రెట్లు పెరిగిందన్నమాట.
కిలో నిమ్మకాయలు రూ.200లను తాకింది. గతంలో ఇది సుమారు రూ.50-60 ఉండేది. మేం ప్రతిదీ బడ్జెట్లో సమకూర్చుకోవాలని భావిస్తాం. కానీ నిమ్మకాయల ధరల పెరుగుదల కిచెన్ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నది. నిమ్మకాయల ధరలు ఎప్పుడు దిగి వస్తాయో తమకు తెలియడం లేదని ఓ కస్టమర్ వాపోయాడు.
పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ సీ విటమిన్ నిల్వలు భారీగా ఉన్న నిమ్మకాయలను తమ భోజనంలో చేరుస్తారు. వడదెబ్బ బారీ నుంచి తేలుకోవడానికి, ఆహారం తేలిగ్గా జీర్ణం కావడానికి నిమ్మకాయలు ఉపకరిస్తాయి. ఎండల నేపథ్యంలో పెరిగిన నిమ్మకాయల వినియోగం వల్ల కూడా కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీసిందంటున్నారు.
ప్రతి కూరగాయ ధర పెరిగింది. కానీ నిమ్మకాయ ధర అంచనా కంటే ఎక్కువ పెరిగింది. మధ్య తరగతి కుటుంబాలు ఖర్చుతో కూడిన కూరగాయలు.. ప్రత్యేకించి నిమ్మకాయలు అధిక ధరకు కొనుగోలు చేయడం కష్టమే. గతానికి భిన్నంగా భారీ మొత్తంలో నిమ్మకాయలు కొనుగోలు చేయలేకపోతున్నాం. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది నిమ్మకాయల ధరలు రెట్టింపయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం అని ఓ కస్టమర్ వ్యాఖ్యానించాడు.
గతంలో వారానికి కిలో నిమ్మకాయలు కొనేవారం. కానీ ధర భారీగా పెరగడంతో ఇప్పుడు 250-500 గ్రాములకు తగ్గించేశాం. తమ ఖర్చులపై ప్రభావం చూపుతున్నదని మరో కొనుగోలుదారు అన్నాడు. ధరల పెరుగుదలతో వ్యాపారులు గానీ, కొనుగోలుదారులు గానీ తక్కువ పరిమాణంలోనే నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు.