న్యూయార్క్, మార్చి 20: భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్..అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది సెప్టెంబర్లో కంపెనీ నరసింహన్ను సీఈవోగా ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం కంపెనీ సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ నరసింహన్..కంపెనీ బోర్డు డైరెక్టర్గా చేరనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ నెల 23న జరగనున్న కంపెనీ వార్షిక షేరు హోల్డర్ల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. బ్రిటన్కు చెందిన కన్జ్యూమర్ హెల్త్, హైజిన్ అండ్ న్యూట్రిషన్ మల్టీనేషనల్ రెక్కిట్ బెన్స్కైజర్ సీఈవోగా విధులు నిర్వహించిన లక్ష్మణ్ నరసింహన్కు 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.