Lava Blaze 3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. లావా బ్లేజ్ 2 5జీ కొనసాగింపుగా వస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లావా బ్లేజ్3 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ చిప్ సెట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు ఉంటాయి. ఫోటోగ్రఫీ వేళ మెరుగైన లైటింగ్ కోసం వైబ్ లైట్ ఫీచర్ జత చేశారు.
లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499 పలుకుతుంది. స్పెషల్ లాంచ్ ఆఫర్ తోపాటు బ్యాంకు ఆఫర్లు కలుపుకుని రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభిస్తుందీ ఫోన్.
లావా బ్లేజ్3 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్ తో 6.56 అంగుళాల హెచ్డీ+ హోల్ పంచ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. దీని ర్యామ్ కెపాసిటీ వర్చువల్ గా 6 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
LAVA Blaze 3 5G: Segment First VIBE Light*
Sale Starts 18th Sept, 12 AM only on @amazonIN
Special Launch Price: ₹9,999***Techarc (5G Smartphones Under 15K)
**Incl. of bank offersKnow more: https://t.co/MVVJxYzXQG#Blaze3 5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/SCeIQ6ugKu
— Lava Mobiles (@LavaMobile) September 16, 2024
లావా బ్లేజ్3 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 2-మెగా పిక్సెల్ సెకండరీ ఏఐ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తుంది. సెకన్ లో 2కే రిజొల్యూషన్ తో 30 ఫ్రేమ్స్ వరకూ వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఏఐ ఎమోజీ మోడ్, పోర్ట్రైట్ మోడ్, ప్రో వీడియో మోడ్, డ్యుయల్ వ్యూ వీడియో, ఏఐ మోడ్ వంటి కెమెరా సెంట్రిక్ ఫీచర్లు ఉంటాయి.
లావా బ్లేజ్3 5జీ ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తోపాటు 5జీ, డ్యుయల్ 4జీ వోల్ట్, డ్యుయల్ బాండ్ వై-ఫై 5, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంటాయి. లావా బ్లేజ్3 5జీ ఫోన్ 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.