Lava Blaze 2 | దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా.. మార్కెట్లోకి లావా బ్లేజ్-2 (Lava Blaze 2) ఆవిష్కరించింది. లో-బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ 13-మెగా పిక్సెల్స్ డ్యుయల్ కెమెరా, 6జీబీ రామ్, యూనిసోన్ టీ616 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. అంతే కాదు.. కొనుగోలుదారులకు ఇంటి వద్దే సర్వీస్ అందించనున్నది. సింగిల్ మెమొరీ వేరియంట్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది.
భారత్‌లో లావా బ్లేజ్-2 ధర రూ.8,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ-కామర్స్ ప్లాట్పామ్ అమెజాన్‌లో మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.
లావా బ్లేజ్-2 ఫోన్ 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిజైన్ @ 90హెర్ట్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. యూనిసోక్ టీ616 ఒక్టాకోర్ ప్రాసెసర్ అమర్చారు. మీడియాటెక్ హెలియో జీ85/ హేలియో జీ88 ప్రాసెసర్ గల ఫోన్లు రూ.10 వేలకు లభిస్తాయి. అదనంగా 5జీ వర్చువల్ రామ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.
రేర్ ప్యానెల్‌పై డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ ఏఐ లెన్స్‌తో వస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18వాట్ల చార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది.