భూములు వాపస్!

నిరుపయోగంగా పరిశ్రమల భూములు
1184 ఎకరాలు స్వాధీనం చేసుకున్న టీఎస్ఐఐసీ
కొత్త సంస్థలకు కేటాయింపు ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం తీసుకొని నిరుపయోగంగా ఉంచిన వందల ఎకరాల భూములను ప్రభుత్వం తిరిగి వెనుకకు తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న 1184 ఎకరాలను గుర్తించిన టీఎస్ఐఐసీ వాటిని స్వాధీనం చేసుకొని ఇతర సంస్థలకు కేటాయిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్థలకు నామమాత్రపు ధరలకే భూములు కేటాయించారు. ఆ భూముల్లో కొన్ని సంస్థలు పరిశ్రమలు స్థాపించగా మరికొన్ని నిరుపయోగంగా ఉంచాయి. మరికొన్ని సంస్థలు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఇప్పటివరకు 18 సంస్థల నుంచి 1184 ఎకరాల భూములను టీఎస్ఐఐసీ వెనుకకు తీసుకుంది. బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్, ఇందూటెక్ జోన్, స్మార్ట్ ఆగ్రో ఫుడ్‌పార్క్, ఎన్వీ డిస్టిలరీస్, ఎంఎల్ఆర్ మోటర్స్ తదితర సంస్థలు తాము తీసుకున్న భూముల్లో పరిశ్రమలు స్థాపించాయి. నిబంధనల ప్రకారం భూములు కేటాయించిన రెండ్లేలోపు పరిశ్రమలు స్థాపించి, ఉత్పత్తి ప్రారంభించాలి. లేకుండా ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన భూకేటాయింపులను సమీక్షిస్తున్నది. కొన్ని భూములపై కోర్టు కేసులున్నాయని, సమర్థమైన వాదనలు వినిపించి వాటిని కూడా స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
వివిధ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల వివరాలు
సం. కంపెనీ పేరు ఇండస్ట్రియల్ పార్కు భూమి (ఎకరాల్లో)
1. ఎక్స్ఎల్ టెలికాం ఫ్యాబ్ సిటీ సెజ్ 10.00
2. కేఎస్కే సూర్య ఫొటోఓల్టెయెక్ఫ్యాబ్ సిటీ సెజ్ 25.00
3. ఓరియెంట్ క్రాఫ్ట్ లిమిటెడ్ ఏఈపీ గుండ్లపోచంపలి 19.00
4. బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. హార్డ్‌వేర్ పార్క్, మామిడిపల్లి 250.00
5. ఇందూటెక్ జోన్ హార్డ్‌వేర్ పార్క్, మామిడిపలి 250.00
6. టెక్‌ఫోర్స్ హార్డ్‌వేర్ పార్క్, మామిడిపల్లి 2.00
7. మెగాసాఫ్ట్(విజువల్ సాఫ్ట్) ఐటీ పార్క్, నానక్‌రామ్‌గూడ 8.00
8. అలెగ్జాండ్రియా బయోటెక్ పార్క్ 13.00
9. గోకల్దాస్ ఇమేజెస్ ఐడీఏ నాచారం 8.00
10. లోంజా ఇండియా ప్రై.లి. బయోటెక్ పార్క్ 10.00
11. ఎంఎల్ఆర్ మోటర్స్ ఆటోమోటివ్ పార్క్ 100.00
12. హిందూజా ఫౌండ్రీస్ ఆటోమోటివ్ పార్క్ 60.00
13. హిందూజా ఫౌండ్రీస్ ఉప్పల్ 6.00
14. లైట్ క్రియేట్ ఐపీ పాశమైలారం 80.00
15. స్మార్ట్ ఆగ్రోఫుడ్ పార్క్ లక్కంపల్లి 200.00
16. ఎన్వీ డిస్టిలరీస్ దామరకుంట 132.00
17. బయోవిన్ కర్కపట్ల 10.00
18. తాజ్ జీవీకే హోటల్స్ హార్డ్‌వేర్ పార్క్, మామిడిపల్లి 1.00
మొత్తం 1184.00
ఇవి కూడా చదవండి:
జూన్ 30 వరకు హెచ్డీఎఫ్సీ ప్రత్యేక డిపాజిట్ స్కీం
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
కరోనా మృతుల బీమా క్లెయిమ్స్: రూ.1,986 కోట్లు
త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

