న్యూఢిల్లీ, జూలై 15: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి రూ.5 కోట్ల విలువైన కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ కారు అయిన ఈ హ్యురాకాన్..కేవలం మూడు సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. 640 హెచ్పీ ఇంజిన్ కలిగిన ఈ కారు గంటకు 310 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చును. భారత్లో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది పది యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.