హైదరాబాద్, అక్టోబర్ 17: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అంతర్జాతీయ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. కువైట్ ఆయిల్ కంపెనీ(కేవోసీ) నుంచి 225.5 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును పొందింది. కేవోసీ బూస్టర్ స్టేషన్ బీఎస్ 171 సమీపంలో ఈ ప్లాంట్‌ను 790 రోజుల్లో నిర్మించాల్సివుంటుందని మేఘా డైరెక్టర్ పీ దొరయ్య చెప్పారు. పశ్చిమ కువైట్‌లోని ఈ వ్యూహాత్మక గ్యాస్ స్వీటెనింగ్ ఫెసిలిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం గర్వకారణంగా ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సల్ఫర్ రికవరీ యూనిట్‌ను రెండు ప్రాసెసింగ్ ట్రైన్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేఘా నిర్మించనున్నది. ఈ ట్రైన్ ఒక్కోక్కటి రోజుకు 100 టన్నుల సామర్థ్యంతో పనిచేయనున్నది.