Kunal Shah | వాట్సాప్ గ్లోబల్ సీఈవోగా కునాల్ షా..!
Kunal Shah : మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) గ్లోబల్ సీఈవోగా భారత ఆంత్రోప్రెన్యూర్ కునాల్ షా (Kunal Shah) బాధ్యతలు చేపట్టనున్నాడు. 'క్రెడ్' యాప్ వ్యవస్థాపకుడైన కునాల్‌ను తదుపరి సీఈవోగా నియమిస్తున్నట్టు మెటా ప్రకటించింది.
Kunal Shah : మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) గ్లోబల్ సీఈవోగా భారత ఆంత్రోప్రెన్యూర్ కునాల్ షా (Kunal Shah) బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘క్రెడ్’ యాప్ వ్యవస్థాపకుడైన కునాల్‌ను తదుపరి సీఈవోగా నియమిస్తున్నట్టు సోమవారం మెటా(Meta) సంస్థ ప్రకటించింది. 2019 నుంచి సేవలందిస్తున్న విల్ కథ్కార్ట్ వారసుడిగా కునాల్ త్వరలోనే వాట్సాప్ పగ్గాలు అందుకోనున్నాడు.
ఆంత్రోప్రెన్యూర్‌గా విజయవంతమైన, సాంకేతికగ అనుభవం కలిగిన కునాల్ అసవరం వాట్సాప్ యాప్‌కి ఎంతో ఉందని మెటా భావించింది. కునాల్ టెక్నికల్ నాలెడ్జిని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మెచ్చుకున్నారు కూడా. అందుకే.. అన్ని విధాలా సమర్ధుడైన కునాల్‌ను తదుపరి గ్లోబల్ సీఈఓగా నియమించింది.

వాట్సాప్ తుదపరి నాయకుడిగా కునాల్ షా మెటాలో భాగమవ్వనున్నాడు. భారత దేశంలో ముఖ్యమైన సాంకేతిక కంపెనీగా క్రెడ్‌ను అతడు తీర్చిదిద్దాడు. సాంకేతిక నైపుణ్యం, యూజర్ల నాడీ బాగా తెలిసిన కునాల్.. ప్రపంచంలోనే పెద్దదైన మెసేజింగ్ యాప్‌ను మరింత మెరుగ్గా నడుపనున్నాడు. కునాల్‌తో కలిసి పనిచేసేందుకు.. కోట్లాది మందికి వాట్సాప్ సేవల్ని ఉత్తమంగా అందించేందుకు నేను ఎదురుచూస్తున్నా అని జుకర్ బర్గ్ పేర్కొన్నాడు. సాంకేతికపై కునాల్‌కు మెరుగైన అవగాహన ఉండడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాట్సాప్ ఎంతలా ఉపయోగపడుతుంది అనే విషయంలో కునాల్‌కు ఉన్న ఆలోచనలు అతడిని తదుపరి సీఈవోగా ఎంపికయ్యేలా చేశాయి అని మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ వెల్లడించాడు.
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మూడొందల కోట్ల మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అలానే వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపులు కూడా చేస్తున్నారు. డ్రీమ్ప్లగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన క్రెడ్ యాప్ వ్యవస్థాపకుడైన కునాల్ షాకు సాంకేతికతపై మంచి పట్టుంది. క్రెడ్‌తో పాపులరైన అతడికి నిజజీవితంలో ప్రజలు వాట్సాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు? అనేది బాగా తెలుసు. పైగా భారత్‌లోనే వాట్సాప్ యూజర్లు ఎక్కువ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

