KTM Duke 200 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కేటీఎం ఇండియా.. దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ ‘కేటీఎం డ్యూక్ 200’ ఆవిష్కరించింది. న్యూ 2023 కేటీఎం డ్యూక్ 200 బైక్‌లో ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ ఉంది. బీమ్‌పై ఆరు రిఫ్లెక్టర్లతోపాటు 32 ఎల్ఈడీల సెటప్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది. ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్) పక్కనే హెడ్ ల్యాంప్స్ ఉంటాయి.
భారత్ మార్కెట్లో సుదీర్ఘకాలంగా అమ్ముడవుతున్న బైక్ కేటీఎం డ్యూక్ 200లో కొత్త మార్పులేం లేవు. కానీ, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న కేటీఎం డ్యూక్ 200 బైక్.. దేశంలోని అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, సుజుకి గిజర్లతో పోటీ పడుతుంది.
2023 కేటీఎం డ్యూక్ 200 బైక్ ధర రూ.1.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బైక్ కంటే రూ.3,115 ఎక్కువ. రెండు కలర్స్ – ఎలక్ట్రానిక్ ఆరెంజ్, మెటాలిక్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఎల్సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నది.
తాజా కేటీఎం డ్యూక్ 200 బైక్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ 10,000 ఆర్పీఎం వద్ద 24బీహెచ్పీ విద్యుత్, 8000 ఆర్పీఎం వద్ద 19.2 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్నది. డ్యుయల్ చానెల్ ఏబీఎస్, యూఎస్ఎఫ్ ఫోర్క్, 10-స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ ఎట్ రేర్, అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్టైర్స్ తదితర ఫీచర్లతో అత్యాధునిక అడ్వెంచర్ బైక్‌గా నిలువనున్నది.