KTM 250 V | భారత్ మార్కెట్లోకి కేటీఎం250 అడ్వెంచర్ వీ.. ధరెంతంటే..?!
KTM 250 V | ప్రముఖ టూ వీలర్స్ సంస్థ కేటీఎం ఇండియా.. భారత్ మార్కెట్లోకి కేటీఎం 250 ‘వీ’ వేరియంట్ బైక్ ఆవిష్కరించింది.
KTM 250 V |ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘కేటీఎం ఇండియా (KTM India)’ భారత్ మార్కెట్లోకి ‘వీ’ వేరియంట్ 250 అడ్వెంచర్ (V variant of the 250 Adventure) న్యూ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది. పాత బైక్ మాదిరిగానే దీని ధర రూ.2.47 లక్షలు ఉంటుంది. సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250 బైక్‌తో కేటీఎం 250 అడ్వెంచర్ ‘వీ’ వేరియంట్ పోటీ పడనున్నది.
అప్ డేటెడ్ అడ్వెంచర్ టూరిస్ట్ బైక్ ‘కేటీఎం 250 అడ్వెంచర్ వీ’ రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, షార్ట్ వైండ్ స్క్రీన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 14.5-లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్, సేఫ్టీ కోసం డ్యూయల్ చానెల్ ఏబీఎస్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆర్19 రేర్ టైర్, ఆర్17 ఫ్రంట్ టైర్ వస్తాయి. ఈ బైక్ వెయిట్ 177 కిలోలు ఉంటుంది.
కేటీఎం 250 అడ్వెంచర్ వీ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, డీఓహెచ్సీ, లిక్విడ్ కూల్డ్ ఎఫ్ఐ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9000 ఆర్పీఎం వద్ద 30 పీఎస్ విద్యుత్, 7500 ఆర్పీఎం వద్ద 24 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ బైక్ ఇంజిన్.. 6-స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ ఫీచర్‌తో రూపుదిద్దుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

