కిటెక్స్కు తెలంగాణ కిక్కు

- రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం నేపథ్యంలో పరుగులు తీస్తున్న షేర్లు
- వారం రోజుల్లో 85 శాతానికిపైగా పెరిగిన విలువ
ముంబై, జూలై 16: దేశీయ స్టాక్ మార్కెట్లలో కిటెక్స్ గార్మెంట్స్ షేర్ల హవా నడుస్తున్నది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించిన మరుక్షణం నుంచి షేర్ల విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. కేవలం వారం రోజుల్లో కిటెక్స్ షేర్ విలువ 85 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం. రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గత వారం కిటెక్స్ అధినేత సాబూ జాకబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణకున్న జోష్.. కిటెక్స్ షేర్లకూ సంతరించుకున్నది. షేర్ విలువ రూ. 110.05 నుం చి రూ. 204. 05కు ఎగబాకింది. బుధవారం ఒక్కరోజే 10 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ సైతం గడిచిన వారం రోజుల్లో రూ.732 కోట్ల నుంచి ఏకంగా రూ.1,357 కోట్లకు ఎగిసింది. కిటెక్స్లో సాబూ జాకబ్కున్న వాటాల విలువ కూడా రూ.754 కోట్లకు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

