Kia Syros| దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా (Kia India) గ్లోబల్ మార్కెట్లలో తన కంపాక్ట్ ఎస్యూవీ (Compact SUV) కారు న్యూ కియా సిరోస్ (Syros)ను ఈ నెల 19న ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సొనెట్ (Sonet), సెల్టోస్ (Seltos) మధ్య నిలుస్తుందని భావిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న భారత్ మొబిలిటీ ఎక్స్ పో (Bharat Mobility Expo)లో కియా ఇండియా (Kia India) తన కొత్త కియా సిరోస్ (Kia Syros) కారును ప్రదర్శించనున్నది. ఇదే ఎక్స్ లోలో కియా సిరోస్ కారు ధర కూడా ప్రకటిస్తుందని భావిస్తున్నారు. స్కోడా కైలాక్ (Skoda Kylaq), నిసాన్ మాగ్నైట్ (Nissan Magnite), రెనాల్ట్ కైగర్ (Renault Kiger), మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx), టయోటా టైసోర్ (Toyota Taisor) తదితర ఎస్యూవీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది కియా సిరోస్ (Kia Syros).
న్యూ కార్నివాల్లో మాదిరిగా కియా సిరోస్ కారులో ఫ్రంట్లో డీఆర్ఎల్స్తోపాటు క్యూబికల్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బ్లాక్డ్ ఔట్ సీ-పిల్లర్, ఫ్లష్ ఫిటింగ్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇన్ సైడ్లో లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, న్యూ ఎయిర్ క్రాఫ్ట్ థ్రోట్టెల్ లైక్ గేర్ షిఫ్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వైర్ లెస్ చార్జింగ్ పాడ్, పనోరమిక్ సన్ రూఫ్, మల్టీపుల్ టైప్-సీ యూఎస్బీ పోర్ట్స్, మల్టీ లేయర్ డాష్ బోర్డ్ థీమ్, కెమెరా కోసం ప్రత్యేక బటన్, ఫ్రీక్వెంట్లీ ఆపరేటెడ్ ఫంక్షన్స్ కోసం ఫిజికల్ కంట్రోల్స్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుందని భావిస్తున్నారు. పవర్ ట్రైన్ వివరాలు వెల్లడించకున్నా సోనెట్ లో మాదిరిగా 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్లతో కియా సిరోస్ కారు వస్తుందని భావిస్తున్నారు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఐఎంటీ, ఏటీ అండ్ డీసీటీ వర్షన్లలో లభిస్తుంది.