Kia Sonet Auros | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీ సొనెట్ ‘ఔరోస్` స్పెషల్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. సొనెట్ హెచ్‌టీఎక్స్ ఆధారంగా ‘ఔరోస్’ రూపుదిద్దుకున్నది. దీని ధర రూ.11.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.13.45 లక్షలు పలుకుతుంది. సొనెట్ హెచ్‌టీఎక్స్ వేరియంట్ తో పోలిస్తే ఔరోస్ మోడల్ కారు ధర రూ.40 వేలు ఎక్కువ.
వేరియంట్ —————————- ధర (రూ)
1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఐఎంటీ — 11.85 లక్షలు
1.0 లీటర్ల టర్బో పెట్రోల్ డీసీటీ —– 12.39 లక్షలు
1.5 లీటర్ల డీజిల్ ఐఎంటీ ———— 12.65 లక్షలు
1.5 లీటర్ల డీజిల్ ఏటీ —————- 13.45 లక్షలు
కియా మోటార్ ఇండియా సోనెట్ ఔరోస్ ఎడిషన్ కారు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్ తో మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 120 హెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తున్నది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 116 హెచ్‌పీల విద్యుత్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ట్యూన్ అవుతుంది.
సొనెట్ ఔరోస్ ఎడిషన్ కారు 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్రౌన్ జ్యువెల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆపరేటెడ్ విత్ వాయిస్ కమాండ్స్ ఆప్షన్లు ఉంటాయి. ఈ కారు నాలుగు కలర్స్ ఆప్షన్లు -గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెరల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లాసియర్ వైట్ పెరల్ రంగుల్లో లభిస్తుంది.
8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సపోర్ట్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, 4 స్పీకర్ సిస్టమ్ విత్ టూ వీలర్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఫంక్షన్, స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
కారులో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం యాంటీ -లాక్ బ్రేక్స్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), 4 ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లు ఉంటాయి.