Kia Seltos Facelift | 2019లో భారత్ మార్కెట్లోకి ఎంటరైంది దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్.. సెల్టోస్ ఎస్‌యూవీతో భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే అత్యంత పాపులర్ బ్రాండ్ అవతారం ఎత్తింది. భారత్ కార్ల మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్‌యూవీల్లో సెల్టోస్ ఒకటిగా నిలిచింది. దానికి కొనసాగింపుగా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. గతేడాది మధ్యలోనే గ్లోబల్ మార్కెట్లోకి దూసుకొచ్చిన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే జూలైలో ఇండియన్స్‌కు పరిచయం చేయనున్నది కియా మోటార్ ఇండియా.
సెల్టోస్ సింగిల్ పేన్ సన్ రూఫ్తోనే మార్కెట్లోకి ఎంటరైంది. కానీ సెల్టోస్ సన్ రూఫ్ మాత్రం.. హ్యుండాయ్ క్రెటా మాదిరిగా పూర్తిగా పనోరమిక్ సన్ రూఫ్‌తో వస్తున్నది. టాప్ హై ఎండ్ వేరియంట్లలో మాత్రమే పూర్తిస్థాయి పనోరమిక్ సన్ రూఫ్ వ్యూ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
అప్డేటెడ్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు న్యూ ఫ్రంట్ గ్రిల్లె, న్యూ సెట్ ఆఫ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్డ్ బంఫర్, న్యూ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, న్యూ సెట్ ఆఫ్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుత సెల్టోస్ కార్లలో 1.5-లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. కానీ కొత్త సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు 1.5 లీటర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 160 పీఎస్, 253 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఆల్ ఇంజిన్లు ఐఎంటీ (iMT) (క్లచ్ లెస్ మాన్యువల్), ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తాయని భావిస్తున్నారు.
సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ట్విన్ 10.25 అంగుళాల డిస్ ప్లేలు, డ్యుయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ టెయిల్ గేట్, వైర్ లెస్ చార్జర్ ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. అడాస్ ఫీచర్లు.. లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొల్ల్యూషన్ అవాయిడెన్స్, అడిషినల్ సేఫ్టీ ఫీచర్లు, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
హ్యుండాయ్ క్రెటాతోపాటు మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూర్, త్వరలో మార్కెట్లోకి రానున్న హోండా ఎలివేట్, సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.