Kia Picanto Facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా మోటార్.. మార్కెట్లోకి కియా పికాంటో ఫేస్లిఫ్ట్ (Kia Picanto Facelift) వచ్చే ఏడాది మార్కెట్లోకి వస్తున్నది. శక్తిమంతమైన అడాస్ (ADAS) (అత్యాధునిక డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ -Advanced Driver Assistance Systems)తో కార్ల ప్రియులకు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నది. 83 బీహెచ్పీ పవర్, 122 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరించే సామర్థ్యం గల నాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2-లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో వస్తున్నది కియా పికాంటో ఫేస్ లిఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆమోద యోగ్యమైన ధరకే యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది కియా మోటార్.
కియా పికాంటో ఫేస్లిఫ్ట్ (Kia Picanto Facelift) మార్కెట్లోకి ఎంట్రీ కావడంతో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్లకు సవాల్ ఎదురు కానున్నది. ప్రత్యేకించి అప్డేటెడ్ హ్యుండాయ్ ఐ10 (Hyundai i10)తో కియా పికాంటో ఫేస్లిఫ్ట్ (Kia Picanto Facelift) తలపడనున్నది. 2017లో తొలుత మార్కెట్లోకి ఎంటరైన పికాంటో థర్డ్ జనరేషన్ కారు పికాంటో ఫేస్ లిఫ్ట్. ఇప్పటికే రెండు ఫేస్ లిఫ్ట్ మోడల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మిగతా కియా మోటార్ కార్లకు భిన్నంగా సెకండ్ పికాంటో ఫేస్ లిఫ్ట్ (Picanto facelift) డాష్ బోర్డ్ మీద ట్విన్ స్క్రీన్ లుక్ కలిగి ఉంటుంది. 4.2 అంగుళాల ఇన్స్ట్రుమెంటేషన్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ఫ్రీ -స్టాండింగ్ 8-అంగుళాల టచ్ స్క్రీన్ కూడా లభిస్తుంది.గత జనరేషన్ పికాంటో పోలిస్తే స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు మరింత మెరుగ్గా అందుబాటులో ఉంటుంది.
యూరప్-స్పెషల్ సెకండ్ ఫేస్ లిఫ్ట్ కారు అడాస్ శక్తి సామర్థ్యాలతో వెంటిలేటెడ్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్ తదితర ఫీచర్లు ఉంటాయి. 1.2 లీటర్లు, 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్లు మినహా మిగతా ఫీచర్లన్నీ ఒకే లా ఉంటాయి. అత్యంత చౌక ధరకు అందుబాటులోకి వస్తున్నా అత్యంత సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఏఈబీ, ఇతర అడాస్ టెక్నాలజీలతో రూపుదిద్దుకుంటున్నది తాజా కియా పికాంటో ఫేస్ లిఫ్ట్.
100 బీహెచ్పీ విద్యుత్, 172 ఎన్ఎం టార్చి వెలువరించగల 1.0 లీటర్ల 3-సిలిండర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్, 83 బీహెచ్పీ విద్యుత్, 122 ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం గల 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 4-సిలిండర్ ఎంపీఐ ఇంజిన్ కూడా జత చేశారు.
2024లో మార్కెట్లోకి కియా పికాంటో ఫేస్ లిఫ్ట్ మార్కెట్లోకి రానున్నది. యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాతోపాటు కొన్ని ఏషియాన్, లాటిన్ అమెరికా దేశాల్లో కియా మార్నింగ్ అనే పేరుతో ఆవిష్కరిస్తారు. భారత్ మార్కెట్లో ఈ కారు ఆవిష్కరణకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది.