July Bank Holidays | ప్రస్తుతం అంతా డిజిటల్ మయం.. అన్ని రకాల లావాదేవీలు ఆన్లైన్లోనే సాగుతుంటాయి. అయినా, ప్రతి ఖాతాదారుడు వివిధ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చు.
మరో నాలుగు రోజుల్లో జూన్ చరిత్రలో కలిసిపోతుంది. శనివారం నుంచి జూలై ప్రారంభం అవుతుంది. జూలై నెలలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీల కోసం బ్యాంకుశాఖకు వెళ్లే వారు ఒకసారి వచ్చే నెలలో సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో తెలుసుకుంటే వెసులుబాటుగా ఉంటుంది.
వచ్చే నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు. ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు.. అంటే ఏడు రోజులు వారాంతపు సెలవులు ఉన్నాయి. వీటితోపాటు వివిధ కారణాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది రోజులు బ్యాంకులు పని చేయవు. గ్యాంగ్టక్లో జూలై 21 నుంచి 23 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు. 21న షేజీ పండుగ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. 22న నాలుగో శనివారం, 23న ఆదివారం వారాంతపు సెలవులు ఉన్నాయి.
జూలై 2: ఆదివారం – దేశమంతటా సెలవు.
జూలై 5: గురు హర్ గోవింద్ సింగ్ జయంతి -జమ్ము, శ్రీనగర్ లలో సెలవు.
జూలై 6: మీజో హ్మెచ్చే ఇన్సుహిఖావ్ పాల్ (ఎంహెచ్ఐపీ) – మిజోరం అంతటా బ్యాంకులు పని చేయవు.
జూలై 8: రెండో శనివారం – దేశమంతటా సెలవు.
జూలై 9: ఆదివారం – దేశమంతటా సెలవు.
జూలై 11: కెర్-పూజ – త్రిపురలో బ్యాంకులకు సెలవు.
జూలై 13: భానూ జయంతి – సిక్కింలో బ్యాంకులు మూత.
జూలై 16: ఆదివారం – దేశమంతటా సెలవు.
జూలై 17: యూ టిరోట్ సింగ్ డే – మేఘాలయలో సెలవు.
జూలై 21 : ద్రుక్ప షేజీ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.
జూలై 22: నాలుగో శనివారం – దేశమంతటా సెలవు.
జూలై 23: ఆదివారం – దేశమంతటా సెలవు.
జూలై 28 : అశూరా – జమ్ము కశ్మీర్ లో బ్యాంకులు పని చేయవు.
జూలై 29 : మొహర్రం – దేశమంతటా సెలవు.
జూలై 30 : ఆదివారం – దేశమంతటా సెలవు.