న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో ప్రధాన ఉక్కు తయారీ కంపెనీల్లో ఒకటైన జేఎస్డబ్ల్యూ స్టీల్ నికరలాభం 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో నాలుగు రెట్లు పెరిగి, రూ.7,179 కోట్లకు చేరింది. 2020 ద్వితీయ త్రైమాసికంలో ఈ లాభం రూ.1,595 కోట్లు. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.19,416 కోట్ల నుంచి రూ. 33,449 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో ముడి ఉక్కు ఉత్పత్తి 6 శాతం వృద్ధితో 38.5 లక్షల టన్నుల నుంచి 41 లక్షల టన్నులకు చేరినట్లు సంస్థ తెలిపింది.