గురుగ్రామ్, నవంబర్ 22: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియాకు చెందిన ఈవీ కార్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గడిచిన ఎడాదికాలంలో ఎంజీ విండ్స్ర్ మాడల్ 50 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.
దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఈ కీలక మైలురాయికి చేరుకోవడం విశేషమని కంపెనీ ఎండీ అనురాగ్ మెహరోత్రా తెలిపారు.