ముంబై, ఫిబ్రవరి 15: ఇంధన రిటైలింగ్ జాయింట్ వెంచర్ జియో-బీపీ.. ‘యూ-డిజర్వ్-మోర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. తమ కస్టమర్ల అనుభవాన్ని చాటిచెప్పేలా.. వారి ప్రతిపాదనల్ని ఆచరణలో పెట్టేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెర్ఫార్మెన్స్, సర్వీస్, టెక్నాలజీ అంశాల ప్రాతిపదికన, వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రచారం సాగుతుంది.
తమ బంకుల్లో డీజిల్.. వాహనదారులకు 4.3 శాతం అధికంగా మైలేజీని ఇస్తున్నదని, వాహనాల ఇంజిన్లను ఇక్కడి పెట్రోల్ ఇతర సంస్థల పెట్రోల్‌తో పోల్చితే 10 రెట్లు ఎక్కువ క్లీన్‌గా ఉంచుతున్నదని జియో-బీపీ చెప్తున్నది. అంతర్జాతీయంగా అభివృద్ధిపర్చిన ‘యాక్టివ్’ టెక్నాలజీ దోహదం చేస్తున్నదన్నది.