Jack Maa-Trump Relations | ట్రంప్‌తో భేటీ జాక్‌మా కొంప ముంచిందా.. అందుకేనా జిన్‌పింగ్ కొరడా?!
Jack Maa-Trump Relations | జాక్‌మా.. నాలుగేండ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కావడం జీ జిన్‌పింగ్ నచ్చలేదని తెలుస్తోంది.

Jack Maa-Trump Relations | ఆలీబాబా.. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటి.. దాని వ్యవస్థాపకుడు జాక్ మా… ఆయనపైనా ఆయన సారధ్యంలోని ఆలీబాబా, ఆంట్ గ్రూప్ సంస్థలపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొరడా ఝుళిపించడానికి కారణమేమిటి.. నాలుగేండ్ల క్రితం.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయనతో జాక్ మా భేటీ కావడం జిన్‌పింగ్‌కు నచ్చలేదా? అందుకే జాక్‌మా తీరుపై కినుక వహించారా?

జిన్‌పింగ్‌పై ట్రంప్ దాడి ఇలా
అవును మరి.. చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర తీసిన డొనాల్డ్ ట్రంప్.. జీ జిన్‌పింగ్ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అంతే కాదు.. చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం ప్రభావం గ్లోబల్ ఎకానమీపైనా పడింది.

అమెరికన్లకు 10 లక్షల ఉద్యోగాలపై జాక్ మా
అటువంటి ట్రంప్‌తో జాక్ మా చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం.. పైగా 10 లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని హామీలు ఇవ్వడం జీ జిన్‌పింగ్‌కు రుచిస్తుందా.. రుచించలేదని అంటున్నాయి తాజా పరిణామాలు.. తమ నుంచి అనుమతి తీసుకోకుండా ట్రంప్‌తో భేటీ కావడంతోపాటు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ జాక్‌మా ఇవ్వడం జిన్‌పింగ్‌కు నచ్చలేదని సమాచారం. అయితే, జాక్‌మాతో ట్రంప్ భేటీ వార్తలపై ట్రంప్ అధికార ప్రతినిధి స్పందించలేదు. ఇటు చైనా విదేశాంగశాఖ సైతం రెస్పాండ్ కాలేదు.

ఇలా 2020 అక్టోబర్ సదస్సులో జాక్‌మా వ్యాఖ్యలు
పేరుకు గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ సదస్సులో చైనా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జాక్ మా సుద్దులు చెప్పారని.. ఇది జిన్‌పింగ్ దృష్టికి వెళ్లిందని వార్తలొచ్చాయి. దీంతో ఆలీబాబా, దాని అనుబంధ యాంట్ గ్రూప్‌లపై యాంటీ ట్రస్ట్, నియంత్రణ సంస్థలను జిన్‌పింగ్ ఉసిగొలిపారని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. ప్రభుత్వ ఆంక్షలు ఎదుర్కొన్నందుకు ఆలీబాబా మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా హరించుకుపోయింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంలోని పలు సంస్థల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ప్రపంచ కుబేరుల జాబితా నుంచి జాక్ మా పేరు కనుమరుగైంది. చాన్నాళ్ల పాటు అంటే ఇటీవలి వరకు జాక్ మా బయటి ప్రపంచానికి కూడా కనిపించలేదు.

యాంట్ గ్రూప్ ఐపీవో లక్ష్యానికి బ్రేక్
ఏడాది క్రితం జాక్‌మా సారధ్యంలోని ఆలీబాబా అనుబంధ ఆంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీవోకు వెళ్లాలని నిర్ణయించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్న చందంగా చైనా కార్పొరేట్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మా సామ్రాజ్యంపై జీ జిన్‌పింగ్ సర్కార్ నిప్పులు కురిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటిగా ఉన్న ఆలీబాబాకు గల వనరులకు కోత పెట్టింది. అడుగడుగునా ఆంక్షలు విధించింది.

ఈయూ టూర్లో జాక్ మా
అయితే, దాదాపు ఏడాది తర్వాత ప్రస్తుతం హార్టికల్చర్, పర్యావరణ అంశాలపై స్టడీ పేరిట యూరప్‌లో జాక్ మా.. లో ప్రొఫైల్ ట్రిప్‌లో ఉన్నారు. జీ జిన్‌పింగ్ సర్కార్ కొరడా ఝుళిపించిన తర్వాత జాక్‌మా తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. గత నెలలో స్పెయిన్ దీవి మాల్లోర్కాలో జాక్ మా ప్రత్యక్షమయ్యారు.
ఇదిలా ఉంటే, జాక్ మా సంస్థలపై కొరడా ఝుళిపించిన జీ జిన్‌పింగ్ సర్కార్ తర్వాతీ కాలంలో ప్రైవేట్ రంగంలో సేవలందిస్తున్న టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, గేమింగ్, ఎడ్యుకేషన్, క్రిప్టో కరెన్సీలు, ఫైనాన్స్ సంస్థల నిర్వహణకు విధి విధానాలు కట్టుదిట్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి:
Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

