హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో సంస్థ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో విప్రో కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవ్ స్వామినాథన్ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విప్రో సంస్థకు అవసరమయ్యే వారికి స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి నియమించుకోవాలని సూచించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయాలని రాఘవ్‌ను కోరారు.