Children Education Fund | పిల్లల విద్య కోసం ప్రణాళిక అనేది తల్లిదండ్రులకున్న అత్యంత కీలక ఆర్థికాంశం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారి ఉన్నత విద్య ఖర్చుల కోసం పొదుపు చేయడం ఎంతో తెలివైన పని. అయితే అందుకున్న మార్గాలను పరిశీలిస్తే..
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు
పిల్లల ఉన్నత విద్య వంటి దీర్ఘకాల లక్ష్యాల కోసం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు సరైన నిర్ణయమనే చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.
హైబ్రిడ్ ఫండ్స్
హైబ్రిడ్ ఫండ్స్.. అటు ఈక్విటీల్లో, ఇటు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతాయి. వీటిలో రిస్క్, రిటర్న్స్ అనేవి సమతూకంగా ఉంటాయి.
విద్యా పథకాలు
వివిధ మ్యూచువల్ ఫండ్స్ పిల్లల విద్య కోసం రకరకాల పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ఈక్విటీలు, రుణ లేదా బంగారాల్లో పెట్టుబడులు పెడుతాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లు
తక్కువ రాబడులను అందించినా.. సురక్షిత పెట్టుబడులుగా వీటిని చెప్పుకోవచ్చు. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే వీటిలో రిస్క్ ఉండదు. కచ్ఛితమైన రాబడులుంటాయి.
విద్యా రుణాలు
ట్యూషన్ ఫీజులు, రోజువారీ జీవన ఖర్చులు, ఇతరత్రా వ్యయాలను ఈ విద్యా రుణాలతో అధిగమించవచ్చు. పిల్లల విద్య పూర్తయిన తర్వాత తిరిగి చెల్లించేలా మారటోరియం పీరియడ్‌కు వీలుంటుంది. అంతేగాక పాత పన్ను విధానం కింద ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80ఈ ద్వారా రుణగ్రహీతలు పన్ను మినహాయింపులనూ అందుకోవచ్చు.
బీమా ప్లాన్లు
చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు.. అటు పెట్టుబడి, ఇటు బీమా సదుపాయంతో ఉంటాయి. ఒకవేళ పాలసీదారు దురదృష్టవశాత్తు చనిపోతే ఒకేసారి పెద్దమొత్తంలో కుటుంబీకులకు ధన సాయం లభిస్తుంది.