న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి మాడల్లోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని స్పష్టంచేసింది. ఇటీవల తీసుకొచ్చిన భారత్ ఎన్సీఏపీ ప్రోగాంలో భాగస్వామ్యులమవుతున్నట్టు, దీంట్లో భాగంగా ప్రతి మాడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసినట్లు, భవిష్యత్తులో మరిన్ని మాడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
కార్లలో ప్రయాణికుల భద్రత ప్రమాణాలు పరీక్షించి రేటింగ్ ఇచ్చే కొత్త విధానమే ఈ భారత్ ఎన్సీఏపీ. మరోవైపు, కంపెనీకి చెందిన మిడ్‌సైజ్ సెడాన్ వెర్నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని హ్యుండాయ్ మోటర్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు.