IRCTC Bharath Darshan : 29 నుంచి ఐఆర్సీటీసీ ‘భారత్ దర్శన్’
IRCTC Bharath Darshan : దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక స్థలాలకు తీసుకెళ్లే ప్రత్యేక పర్యటన ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది

ముంబై : దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక స్థలాలకు తీసుకెళ్లే ప్రత్యేక పర్యటన ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ‘భారత్ దర్శన్’ (IRCTC Bharath Darshan) ప్యాకేజీలో హైదరాబాద్ కూడా ఉండటం విశేషం.
దేశంలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టింది. 11 రాత్రులు/12 పగల్లు ఉండే ఈ ప్రత్యేక ప్యాకేజీని పెద్దవారికి రూ.11,340 కే అందివ్వనున్నారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక పర్యటనలో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భావ్‌నగర్‌లోని నిష్కలంక్ మహాదేవ్ సీ టెంపుల్, అమృత్సర్, జైపూర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రదేశాలను చేర్చారు. ఈ ప్రత్యేక పర్యటనలో స్లీపర్ క్లాస్ టికెట్‌తోపాటు కూరగాయల భోజనం, నాన్ ఏసీ ట్రాన్స్పోర్ట్, హాల్ అకామడేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ ప్రత్యేక పర్యటనలో పాలుపంచుకోవాలనుకునే వారు తమ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఆర్సీటీసీ జోనల్, రీజనల్ కార్యాలయాల్లో కూడా బుకింగ్ చేసుకునే వీలున్నది.
ఈ ప్రత్యేక టూర్‌కు వెళ్లే వారికి ట్రావెల్ ఇన్సురెన్స్‌తోపాటు శానిటైజేషన్ కిట్‌ను అందజేస్తారు. మధురై, సేలం, దిండిగల్, ఈరోడ్, జోనారిపెట్టై కరూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నెల్లూరు, విజయవాడల్లో బోర్డింగ్ పాయింట్లు, విజయవాడ, నెల్లూరు, పెరంబూర్, కాట్పాడి, జోలారిపెట్టై , సేలం, ఈరోడ్, కరూర్, దిడిగల్, మధురైలలో డీ-బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటుచేశారు. ప్రయాణం ప్రారంభానికి 48 గంటలు ముందుగా కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ధ్రువీకరణపత్రాన్ని అందజేయాలి. ఈ పర్యటన పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ అందజేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తొలిసారి ఇంట్లోకొచ్చిన కంప్యూటర్ టీఆర్ఎస్-80
కరోనా వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

