హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్ ఆధారిత ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్.. అమెరికా ఔషధ రంగ దిగ్గజం వియాట్రిస్కు చెందిన భారత ఏపీఐ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి పూర్తికానున్న ఈ ఒప్పందంలోని ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. వైజాగ్ యూనిట్లు, హైదరాబాద్లోని ఏపీఐ తయారీ ప్లాంట్లతోపాటు నగరంలో ఉన్న ఆర్అండ్డీ కేంద్రం ఐక్వెస్ట్ చేతికి రానున్నాయని సంస్థ ఈడీ గునుపాటి స్వాతి రెడ్డి చెప్పారు.