iPhone 15 Pro – iPhone 15 Pro Max | ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు 24 గంటల ముందుగా అంటే 26వ తేదీ నుంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పలు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లపైనా గణనీయ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై డిస్కౌంట్లతోపాటు అదనపు రాయితీ కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. భారత్ మార్కెట్లో ఐ-ఫోన్ 16 వచ్చిన నేపథ్యంలో ఆపిల్ తన ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను డిస్ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లనూ రూ.లక్ష లోపు ధరకే అందుబాటులోకి తెస్తోంది.
ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,900 కాగా, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ధర రూ.1,34,900. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఐ-ఫోన్ 15 ప్రో రూ.89,999, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.99,999లకు లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతోపాటు ఈఎంఐ లావాదేవీలపై క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందిస్తున్నది ఫ్లిప్ కార్ట్. యూపీఐ బేస్డ్ పేమెంట్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు ఏ17 ప్రో చిప్ సెట్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి.