చెన్నై, జూలై 16: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పది బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి రానున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8.15 శాతానికి దించిన సంస్థ..నెల రోజుల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.40 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 8.50 శాతంగా ఉన్నది. అలాగే మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేట్లు వరుసగా 8.55 శాతం, 8.80 శాతం, 9 శాతానికి దిగొచ్చాయి.